దక్షిణ మధ్య రైల్వేకు రికార్డుస్థాయి ఆదాయం?

Chakravarthi Kalyan
దక్షిణ మధ్య రైల్వే జనవరి మాసాంతంలో సరుకు రవాణా విభాగంలో ఒక నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయీ సరుకు రవాణా సాధించింది. ఈ జోన్ ఈ ఏడాది జనవరి నెలలో 131.22 మిలియన్ టన్నుల ఒరిజినేటింగ్ లోడింగ్‌ను సాధించింది. ఇది ఇప్పటివరకు సాధించిన నెలవారి సరుకు రవాణా లోడింగ్ లలో ఇదే  అత్యధికం కావడం విశేషం. ఇదివరకు సాధించిన అత్యధిక  లోడింగ్  మే 2023లో 12.517 మిలియన్ టన్నులు.

గత సంవత్సరం  జనవరి 2023 సరుకు రవాణా లోడింగ్ తో పోల్చినప్పుడు 7శాతం వృద్ధిని సాధించింది. లోడింగ్‌లో రికార్డు పనితీరుతో పాటు సరుకు రవాణా ఆదాయం దీటుగా పెరిగింది. దక్షిణ మధ్య రైల్వే జనవరి 2024లో  రూ. 1,296.73 కోట్ల సరుకు రవాణా ఆదాయం సాధించింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి సరుకు రవాణా విభాగంలోని  నెలవారీ ఆదాయాలలో అత్యధిక నెలవారీ ఆదాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: