శ్రీదేవి మరణ రహస్యం.. రంగంలోకి సీబీఐ?

Chakravarthi Kalyan
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. బాత్‌రూమ్‌లో చనిపోవడం పై అనుమానాలున్నాయి. అయితే.. ఇప్పుడు దానిపై మరో సంచలన విషయం వెలుగు చూసింది. శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలను సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి.ఆర్‌.పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. శ్రీదేవి మరణంపై దీప్తి ఇటీవల సోషల్ మీడియాలో చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో వివాదాస్పదంగా దీప్తి ఆరోపణలు చేశారు.

శ్రీదేవి మరణంపై సొంతంగా విచారణ జరిపానని దీప్తి అంటున్నారు. యూఏఈ, భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచాయని దీప్తి పేర్కొన్నారు. అంతే కాదు.. ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలతో పాటు.. సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను దీప్తి చూపించారు. అయితే అవి నకిలీ పత్రాలంటూ ముంబయి న్యాయవాది చాందినీ షా.. సీబీఐని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు జరిపి దీప్తి చూపిన లేఖలు నకిలీవని తేల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: