జైల్లో సోరెన్‌.. మరి జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టరు?

Chakravarthi Kalyan
జార్ఖండ్ లో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారని... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహాన్‌ రెడ్డిపైన 12కు పైగా కేసులు ఉంటే ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మోదీ ఆపరేషన్‌ వల్ల ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురై రాంచీ నుంచి హైదరాబాద్ లో తలదాచుకున్నారని నారాయణ అంటున్నారు. సోరెన్‌ను మనీ లాండరింగ్ పేరుతో జైల్లో పెట్టారని.. జగన్‌పై 12కు పైగా కేసులు ఉంటే ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారని అన్నారు.

స్వతంత్ర భారతదేశంలోనే ఇన్ని రోజుల పాటు బెయిల్‌ మీద ఉన్న వ్యక్తి ఒక జగన్మొహాన్‌ రెడ్డేనని నారాయణ అన్నారు. మద్యం కుంభకోణంలో కూడా ప్రధానపాత్ర వైసీపీదేనన్న నారాయణ.. లిక్కర్ వైసీపీ తయారు చేస్తే.. కేసీఆర్‌ కుమార్తె మధ్యవర్తిత్వం చేసిందన్నారు. వీళ్లను జైళ్లో వేయకుండా దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను జైళ్లో వేశారని విమర్శించారు. భారత్ దేశంలో జగన్ కంటే పెద్ద డేకాయిట్ ఎవ్వరూలేరని నారాయణ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: