తెలంగాణలో పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగులు?

Chakravarthi Kalyan
సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పరిధిలో జనవరి నెలలో నిర్వహించిన ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా 718 మంది పిల్లలను కాపాడారు. అందులో 661 మంది బాలురు. 57 మంది బాలికలు ఉన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు 301 మంది, బాలికలు 28మంది, బయటి రాష్ట్రాలకు చెందిన 360మంది బాలురు, 29మంది బాలికలు ఉన్నారు. వీరిలో 40మంది భిక్షాటన చేస్తున్నారు. 640మంది బాల కార్మికులుగా ఉన్నారు. ఒకటి మిస్సింగ్‌ కేసు. 37మంది చెత్త ఏరుతూ జీవిస్తున్నారు.
వారిలో 526 మందిని తల్లిదండ్రులకు అప్పగించారు. 192మందిని షెల్టర్‌ హోమ్స్‌కు తరలించారు.  11 టీమ్‌లు ఏర్పడి ఇంతమంది చిన్నారులను రక్షించిన వారిని సీపీ అవినాష్‌ మహంతి అభినందించారు. బాలకార్మికుల రక్షణ కోసం ఈ బృందాలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే 9490617444 లేదా డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: