తెలంగాణ ఆదాయం ఫుల్లుగా పెరిగింది?

Chakravarthi Kalyan
తెలంగాణ ఆదాయం బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ అంచనాలో 57 శాతానికి పైగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ వరకు తెలంగాణ ఆదాయ, వ్యయాల వివరాలను కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 2లక్షల16వేల 566 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేశారు. డిసెంబర్ నెలాఖరు వరకు లక్షా 25వేల2 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అందులో పన్ను ఆదాయం 99వేల 693 కోట్లు . పన్నుల రూపంలో లక్షా 52వేల 499 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా.. 2023 సంవత్సరం చివరి వరకు అందులో 65 శాతానికిపైగా ఖజానాకు చేరింది.
జీఎస్టీ ద్వారా 34వేల147 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రూపంలో 10వేల 654 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 22వేల 251 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో 16వేల 500 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటాగా 10వేల 252 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో 5వేల885 కోట్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: