పేపర్‌ లీకేజీ కేసులో ఛైర్మన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష?

Chakravarthi Kalyan
పేపర్‌ లీకేజీ కేసులో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మాజీ చైర్మన్ సతేంద్ర మోహన్ శర్మ సహా 8 మందికి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు అస్సాం-మంగలూర్ రైల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ సీఈఓ జగన్నాథం, మరో 8మందికి హైదరాబాద్ సీబీఐ కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వీరికి 7.87లక్షల జరిమానా కూడా విధించింది. 2010లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు అసిస్టెంట్ స్టేషన్‌ మాస్టర్, అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాలకు పరీక్షలు జరిగాయి.

ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడంతో సీబీఐ అధికారులు 2010 జూన్‌ 15న కేసు పెట్టారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ సతేంద్ర శర్మ, జగన్నాథం కుట్ర పన్ని పలువురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రశ్నా పత్రాలను ఒక్కొక్కరికి 4లక్షల రూపాయల వరకు విక్రయించినట్లు సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: