వైద్యం అంటే హైదరాబాదేనా.. మారాల్సిందే?

Chakravarthi Kalyan
వైద్యం కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే వైద్యుల కొరత లేకుండా వైద్య కళాశాలలను.. ఆసుపత్రులకు అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని... దానివల్ల ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగడంతో పాటు.. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డిని.. అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: