జోక్యం కుదరదు.. బాబుకు షాక్‌ ఇచ్చిన హైకోర్టు?

Chakravarthi Kalyan
చంద్రబాబుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్పీకర్‌ నోటీసును సవాల్‌ చేస్తూ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. అయితే దీనిలో ఇప్పుడే జోక్యం చేసుకోబోమని తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ గతంలో స్పీకర్ నోటీసు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని స్పీకర్‌ ప్రశ్నించారు.
స్పీకర్‌ నోటీసును సవాల్‌ చేస్తూ ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మండలి ఛైర్మన్ నోటీసును సవాల్ చేసిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా పిటీషన్ వేశారు. హైకోర్టులో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: