బాబోయ్.. హైదరాబాద్‌లో నకిలీ మందుల ముఠా?

Chakravarthi Kalyan
దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ మందులను తయారు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. - ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని.. ఇతర రాష్ట్రాల నుండి కొరియర్ , ఏజెoట్ల ద్వారా హైదరాబాద్ కు తీసుకొస్తున్నారని ఔషధ నియంత్రణ సంస్థ డీజీ కమలాసన్‌ రెడ్డి హెచ్చరించారు.

కేంద్రం నిర్ణయించిన ధరలకు మాత్రమే మెడికల్ షాపులు మందులు విక్రయించాలని.. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడటం మా బాధ్యత అని డీజీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామని.. గత 6 నెలల నుంచి నకిలీ మందుల పై నిఘా పెంచామని.. నకిలీ మెడిసిన్స్, ఇంజక్షన్లు సీజ్ చేశామని తెలిపారు. నకిలీ ఔషధాలపై  1800-599-6969 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: