
ఆరు గ్యారంటీలు.. కాంగ్రెస్‌కు కోడ్ సాకు?
మాజీ మంత్రి హరీష్ రావు ఈ విధంగానే స్పందించారు.
భారాసకు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయి... ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా అని గుర్తు చేశారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు... భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని మాజీ మంత్రి హరీష్ రావు ధైర్యం చెప్పారు.