రంగారెడ్డి మాజీ కలెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు?

Chakravarthi Kalyan
రంగారెడ్డి మాజీ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇబ్రహింపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పై కూడా ఎస్సీ ఎస్టీ, బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహా అతని కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డిజిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్‌ కుమార్, ఇబ్రహింపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండి యూసఫ్ పై ఇబ్రహీం పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహింపట్నం మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.
2019ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోస్టుకోసం మంచిరెడ్డి 2.5కోట్లు తీసుకున్నాడని కప్పరి స్రవంతి ఫిర్యాదులో తెలిపారు. బుడగ జంగాల కులానికి చెందని తాను మున్సిపల్ చైర్‌పర్సన్ గా ఎంపికైన దగ్గరినుంచి కులం పేరుతో వేధిస్తున్నారని కప్పరి స్రవంతి తెలిపారు. పలు మీటింగ్ లలో మర్యాద ఇవ్వకుండా మాట్లాడారని కప్పరి స్రవంతి ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ సైతం ఉన్నత కులంవారితో తక్కువ కులం వారు పెట్టుకోవద్దని చెప్పారని కప్పరి స్రవంతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: