ఐఏఎస్‌లకు దిమ్మ తిరిగేలా.. రేవంత్‌ కొత్త రూల్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు కొత్త రూల్ పెట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మమేకమై బాధ్యతగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరించి.. ప్రజల మనసును గెలుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. చట్టాలు, నిబంధనలను మానవీయ కోణంలో అమలు చేయాలన్నారు.


తెలంగాణ ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరన్న సీఎం రేవంత్ రెడ్డి.. అదే జరిగితే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అధికారులకు చెప్పారు. ప్రజల నుంచి గౌరవ, మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి..  ఎంతటివారినైనా ఇంటికి పంపించే శక్తిమంతమైన చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: