కేరళలో కరోనా విజృంభణ.. ఆంధ్రాలో అలర్ట్?
ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించినా దగ్గర్లోని విలేజి హెల్త్ క్లీనిక్ లలో పరీక్షలు చేయించుకోవాలని ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెబుతున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లను క్రియాశీలకం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఫ్లూజ్వరం లేదా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేయాల్సిందని ఆదేశించారు.