
కేటీఆర్‌కు ఆ తొందర మంచిది కాదా?
రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా హామీ, రూ. 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, రూ.4000 సంక్షేమ పెన్షన్, రూ.500 గ్యాస్ సిలిండర్, మీ పార్టీ ప్రతి మహిళకు రూ.2500 హామీ ఇచ్చిందని.. తొలి మంత్రివర్గంలో మెగా డీఎస్సీ ప్రకటన ఉంటుందని చెప్పారని.. మొదటి క్యాబినెట్‌లో 6 హామీలకు చట్టపరమైన పవిత్రతను అందిస్తామన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ హామీలు బూటకమా లేక ఈ పథకాలు వాగ్దానం చేసిన మీ పార్టీ నాయకులు బూటకమా అని ప్రశ్నించారు. అయితే కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు చేయడం బాగోలేదని.. కాస్త సమయం ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.