న్యూ ఇయర్ వేడుకల్లో ఆ పనులు చేయొద్దు?

Chakravarthi Kalyan
న్యూ ఇయర్ వేడుకలు త్వరలో రానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకలకు రాత్రి 1 గంట వరకు ముగించాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని..ప్రతీ ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా వాడాలని హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలని.. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.


వేడుకల్లో 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దని.. కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దని.. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దని.. లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదని.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: