కేసీఆర్‌ను ఓడించింది కేసీఆరేనా?

Chakravarthi Kalyan
తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపునకు కేసీఆర్ స్వయంకృపరాధాలే ఎక్కువగా కారణం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ గడ్డ మీద తాము తప్ప ఇతరులు ఉండకూడదనే అసహజ కోరిక, లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకుండ రాజీపడ్డారని బలంగా నమ్మిన ప్రజలు, దళితబంధు, బీసీ బంధు వందలో ఒకరికే అందటంతో మిగిలిన 99మందిలోనూ వ్యతిరేకత, స్థానిక ఎన్నికలు సహా అన్ని ఎన్నికల్లోనూ పదేళ్లుగా కారుకు ఓటేసిన జనంలో ఈసారి మార్పు ఆకాంక్ష కారణాలుగా మారాయి.
MPTC నుంచి అన్ని స్థానికసంస్థల్లోనూ గెలిచిన తెరాస నాయకుల పనితీరుపై వ్యతిరేకత, తెలంగాణ రాష్ట్రం ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ అనుకూల ఓటు, కేసీఆర్ వ్యతిరేక ఓటుగా చీలిపోవటం, కేసీఆర్ వ్యతిరేక ఓటు వైపు మెజార్టీ జనం సమీకృతులు అవటం, అండగా ఉన్న ఆంధ్రా సెటిలర్లు, కమ్మ సామాజికవర్గంను దూరం చేసుకోవటం, గెలిచిన ఎమ్మెల్యేలే కాదు మంత్రులకు కూడా సీఎం దర్శనం సులభంగా దొరకకపోవటం కూడా కేసీఆర్ ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: