తెలంగాణ గ్రేట్‌.. మహిళా ఓటర్ల రికార్డ్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799. అందులో పురుషులు 1,62,98,418 మంది. మహిళలు 1,63,01,705 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 9,99,667.
తెలంగాణలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి 21686 వీల్ ఛైర్స్ సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్ మొత్తం కలిపి రెండు లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: