ఉద్యోగాల లెక్కలు బయటపెట్టిన కేటీఆర్‌?

Chakravarthi Kalyan
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వివరాలతో మంత్రి కేటీఆర్ ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. యువతతో తాజాగా జరిగిన సమావేశం అనంతరం ఆ వివరాలన్నింటితో కూడిన వెబ్ సైట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. www.telanganajobstats.in అనే వెబ్ సైట్లో ఉద్యోగాల వివరాలు మంత్రి కేటీఆర్ పొందుపరిచారు. ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.


విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిళ్లు ఏర్పాటు వంటి వివరాలను వెబ్ సైట్ లో మంత్రి కేటీఆర్ అందుబాటులో ఉంచారు. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించిందని.. అందులో లక్షా అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: