తెలంగాణ: ముందే ఓటేసిన పోలీసులు?

Chakravarthi Kalyan
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పీవో, పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు ముందుగానే వినియోగించుకుంటున్నారు. దీని కోసం గ్రేటర్ 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి.ఓ లు, ఏ.పి.ఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నియోజకవర్గాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓట్లు వేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం, చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్ పుర నియోజకవర్గం బహదూర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: