తెలంగాణ: బీసీల ఓట్లు బీసీలకేనా?

Chakravarthi Kalyan
బీసీల అస్థిత్వం, దొరల అధిపత్యం మధ్యే తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ అంటున్నారు. ఎన్నికల్లో బీసీ ఓట్లు బీసీలకే అనే నినాదంతో బీసీల ఐక్యతను చాటుతామని జాజుల శ్రీనివాస్‌ అంటున్నారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా రేపటి నుంచి పని చేస్తామన్న జాజుల శ్రీనివాస్‌.. బీసీల పట్ల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజకీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని జాజుల శ్రీనివాస్‌ మండిపడ్డారు. 


తెలంగాణలోని కాంగ్రెస్‌, బీజేపీ, భారాస మూడు పార్టీలు కేవలం 85 మంది బీసీలకు మాత్రమే సీట్లు ఇచ్చాయని జాజుల శ్రీనివాస్‌ అన్నారు. 120కి పైగా అగ్ర కులాలకు అవి పెద్దపీట వేశాయని.. బీసీ అభ్యర్థులను గెలిపించుకోని బీసీ సత్తా చాటుతామని జాజుల శ్రీనివాస్‌ అన్నారు. తాము ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వడం లేదని జాజుల శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీసీ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని బీసీ ముఖ్యమంత్రి చేసుకుంటామని జాజుల శ్రీనివాస్‌ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: