స్కిల్‌ కేసు నుంచి చంద్రబాబుకు విముక్తి లభించినట్టేనా?

Chakravarthi Kalyan
స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆ కేసుపై ఆసక్తి నెలకొంది. ఇక ఆ కేసు నుంచి చంద్రబాబుకు విముక్తి లభించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒప్పందాల్లో తేడాలు ఉంటే దానికి సిఎం ఎలా బాధ్యులు అవుతారు అని నిన్న హైకోర్టు కోర్టు ప్రశ్నించింది. సీమెన్స్ ను ఈ సేవలకు ఉపయోగించుకోవాలని వారికి డబ్బులు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయంలో ఐఎఎస్ అధికారి శ్రీమతి సునీత కూడా భాగస్వామి అన్న విషయాన్ని  హైకోర్టు గుర్తు చేసింది.

 
సునీత తప్పు చేసినట్లు కానీ...ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కానీ సిఐడి ఎక్కడా చెప్పలేదని.. ముఖ్యమంత్రికి విశేష అధికారాలు లేవని కూడా సిఐడి వాదించలేదని.. నిధులు విడుదల చేయాలి అని ఆదేశించినంత మాత్రాన ఆధారాలు లేకుండా ఆ నిధులు పార్టీ ఖాతాకు మళ్లించారనడం సరికాదని  హైకోర్టు  పేర్కొంది. అంతే కాదు.. సబ్ కాంట్రాక్టర్ల తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యడు అవుతారన్న వాదనలతో  హైకోర్టు ఏకీభవించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: