కేసీఆర్ మొండికత్తి డైలాగ్‌.. కోర్టులో కేసు?

Chakravarthi Kalyan
ఆ మధ్య కేసీఆర్ విపక్షాలపై విరుచుకుపడుతూ మొండి కత్తి డైలాగ్ వాడారు కదా. దానిపై ఇప్పుడు హైకోర్టులో కేసు పడింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌పై ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ హైకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. కొన్ని రోజుల క్రితం కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని బలమూరి వెంకట్‌ ఆరోపించారు.


న్యాయస్థానాన్ని ఆశ్రయించక ముందే  కెసిఆర్ వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని బలమూరి వెంకట్‌ విమర్శించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు బలమూరి వెంకట్‌ వివరించారు. ఆయన వేసిన పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి కోర్టు ఏం చెబుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: