తెలంగాణ బీజేపీ చివరి అస్త్రంగా అమిత్‌షా?
అదే రోజున అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సోమాజిగూడలోని భాజపా మీడియా సెంటర్ లో కేంద్ర మంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అంతే కాదు.. అదే రోజు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తారు. ఒక్కరోజే 4 సభలకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తోంది. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్ర నగర్ సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.