మాదిగలు కేసీఆర్‌కు ఝలక్‌ ఇస్తారా?

Chakravarthi Kalyan
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సికింద్రాబాద్‌లో నిర్వహించిన విశ్వరూప మహా సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవ్వడం.. వర్గీకరణ చేస్తామని మాట ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ సభతో తెలంగాణలో మాదిగలు బీజేపీకి ఓటేసే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ మాదిగ అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డాం.. భయపడ్డామన్న మంద కృష్ణ మాదిగ.. మాదిగలను పశువుల కంటే హీనంగా చూసింది ఈ సమాజం అన్నారు.

 
సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్, భారాస అమలు చేయలేదని.. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరేనన్న మంద కృష్ణ మాదిగ.. మాదిగలను కాపాడే పెద్ద అన్నగా ప్రధాని వచ్చారన్నారు. మొదటిసారి ప్రధాని అయిన మోదీ దళితుడిని రాష్ట్రపతిని చేశారని.. రెండోసారి ప్రధాని అయ్యాక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేశారని.. కేసీఆర్ మంత్రివర్గంలో 18మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రి లేరని మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: