కాళేశ్వరంపై కేసీఆర్‌ నోరు మెదపరేం?

Chakravarthi Kalyan
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర నిపుణులు ఇచ్చిన నివేదిక తెలంగాణలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రాజెక్టు మొత్తం తిరిగి కట్టాల్సిందేనని ఆ రిపోర్టు చెప్పడంతో కాళేశ్వరం అంశం ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారబోతోంది. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ మాత్రం ఈ అంశంపై ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్ , డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్ మెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని నివేదిక తెలిపింది.

మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదు, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదు, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదని నివేదిక తెలిపింది. అయితే ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదు. అంతే కాదు.. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. వేల కోట్లు నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదన్న అనుమానాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: