కాళేశ్వరం.. కావాలనే ఆ రిపోర్టులు దాచి పెట్టారా?

Chakravarthi Kalyan
కాళేశ్వరం బ్యారేజీ కుంగుబాటుపై కేంద్ర నిపుణులు ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. కేంద్ర నిపుణులు అడిగిన అనేక అంశాలను రాష్ట్ర అధికారులు ఇవ్వకపోవడం కలకలం రేపుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాష్ట్రం కొన్ని రిపోర్టులు కావాలనే దాచిపెట్టడం దాచిపెట్టిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్టులు ఇవ్వకుండా దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తుందన్న ప్రవీణ్ కుమార్.. రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ పాలన పోవాలన్నారు.
కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ హస్తం ఉందన్న ప్రవీణ్ కుమార్.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం కేసీఆర్ కమీషన్లే అన్నారు. కాళేశ్వరం ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం చెందిందన్న ప్రవీణ్ కుమార్.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం నాసిరకంగా కట్టడమేనన్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: