ఆ పుస్తకంలో కాంగ్రెస్‌ నేతల రహస్యాలు ఉంటాయా?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ తన జీవిత కథను పుస్తకంగా తీసుకొస్తున్నారు. 50 ఏళ్ళ అనుభవంలో విద్యార్ధి, యూత్ కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షులుగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పని చేసిన ఆయన.. తన అనుభవంతో జీవిత చరిత్ర పై పుస్తకం రాస్తున్నారు. హనుమంతుడు అందరి వాడే పేరుతొ పుస్తకం విడుదల చేస్తున్నారు. వచ్చే తరం వారికి తెలియాలని బుక్ రాస్తున్నానన్న వీహెచ్.. తనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, పోయిందని చెబుతున్నారు.

నాతో  కేసీఆర్ , చంద్రబాబు పని చేసారని అనుభవాలు వచ్చే తరానికి తెలియాలని.. సంజయ్ గాంధీ ఆలోచనతో  ఓల్డ్ సిటీ లో 50 రోజులు తిరిగానని.. రాజీవ్ గాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడుని చేశారని.. నేను సహాయం చేసిన వారి పై కూడా పుస్తకం లో రాసానని.. రాజకీయంగా ఎదుగుదల,  నష్టం కూడా ఆ బుక్ లో రాశానని వీహెచ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vh

సంబంధిత వార్తలు: