తెలంగాణలో ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ ఇచ్చిన తొలిపార్టీ!
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. టీఎస్పీఎస్సీని భ్రస్టు పట్టించిన ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని... యావత్ నిరుద్యోగ యువత బీఎస్పీ వైపు చూస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలకు వెళ్లవద్దని... ఒకవేళ వెళితే ద్రోహం చేసినట్లేనని, అవి ప్రజలను హింసించిన సభలు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.