పాలస్తీనాకు కేసీఆర్‌ మద్దతు.. ఎన్నికల కోసమేనా?

Chakravarthi Kalyan
ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఇజ్రాయెల్ పై అనూహ్యంగా విరుచుకుపడిన హమాస్.. ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. అంతే కాదు.. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గాజా శవాల దిబ్బగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెంగాణా ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు పలుకుతోందని మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
అసదుద్దీన్‌ ఒవైసీ నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన మహమూద్ అలీ.. సభకు తనను అసద్ పిలిచారని.. మీరు కూడా అక్కడికి వెళ్లి పాలస్తీనియన్లతో మేము ఉన్నామని మా సందేశం ఇవ్వండని సీఎం కేసీఆర్ తనతో చెప్పారని అన్నారు. మేము ప్రపంచంలో శాంతిని కోరుకుంటున్నామని.. ముస్లింలకు ప్రభుత్వం చేతనైనంత సహాయం చేస్తుందని కేసీఆర్ సందేశం ఇచ్చారని మహమూద్ అలీ తెలిపారు. పాలస్తీనియన్లకు సహాయం చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని మహమూద్ అలీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: