ఇవాళ లోకేశ్, పవన్‌ కీలక భేటీ.. డిసైడ్‌ చేసేస్తారా?

Chakravarthi Kalyan
ఇవాళ టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా, జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహించబోతున్నారు. పొత్తుల ప్రకటన తర్వాత లోకేష్‌, పవన్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

దీనిపై ఇప్పటికే ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులను ప్రకటించాయి. టీడీపీ నుంచి కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య ఉంటారు. అలాగే జనసేన నుంచి కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్‌రెడ్డి, కొటికలపూడి గోవిందరావు ఉంటారు. రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరు పార్టీలు ఇప్పటికే  నిర్ణయించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: