ఎన్నికల ఎఫెక్ట్.. ఏరులై పారుతున్న లిక్కర్?
అటు రంగారెడ్డి ఎక్సైజ్ జిల్లా పరిధిలో రూ. 63.07లక్షలు విలువైన 5998 లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో రూ.30.56లక్షలు విలువైన 3777 లీటర్లు నిల్వ ఉంచిన మద్యాన్నిసీజ్ చేసినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రూ. 8.70 కోట్లు విలువైన 2.5లక్షలు లీటర్లు మద్యం, 560 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోటిన్నర విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.