ఆ పొరపాటు చేయవద్దంటున్న కేసీఆర్..?
కాంగ్రెస్ వస్తే... మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవంటున్న కేసీఆర్.. ఆ పొరపాటు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
నేను తీసుకొచ్చే వరకు దేశానికి రైతుబంధులాంటి పథకం తెలియదన్న కేసీఆర్.. రైతులకు రూ.37 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా లేదని.. మోదీ రాష్ట్రంలో కరెంట్ కోసం ధర్నాలు జరుగుతుంటాయని.. ఎంతో గోసపడిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని మళ్లీ కాంగ్రెస్‌ను గద్దెనక్కించి రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని హెచ్చరించారు.