కాంగ్రెస్‌ జోష్‌పై నీళ్లు చల్లిన పొన్నాల రాజీనామా?

Chakravarthi Kalyan
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీ జోష్‌ను చల్లార్చింది. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన తెలంగాణ ఏర్పాటైన తరువాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. అలాంటి వ్యక్తి ఆవేదనతో పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యుడ్నిచేసి తనను పీసీసీ నుంచి తప్పించారని, ఆ తరువాత 2018లో పార్టీ ఓటమికి కారణమైన పీసీసీని తొలిగించకపోగా ఆయనకు మరిన్ని పదవులు ఇచ్చారని పొన్నాల ఆరోపించారు.

మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, బీసీ నాయకుడిగా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని.. అవమానాలకు గురి చేశారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా జనగాం డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిని నియమించారని.. తాను గెలిచే అవకాశాలు లేవని ఎవరో వ్యూహకర్త నివేదిక ఇచ్చారని చెప్పడం ఏమిటని పొన్నాల ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: