తెలంగాణ: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అధికారుల కుట్ర?

Chakravarthi Kalyan
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని.. అందుకే బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ, స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు, నర్సింగ్ రావు భుజంగరావు అంతా ఒక ప్రయివేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారన్న రేవంత్ రెడ్డి.. ఇందులో చాలా మంది రిటైర్ అయ్యారన్నారు. రిటైర్ అయిన అధికారులను ఎన్నికల కోడ్ రాగానే ఎన్నికల అధికారులు వారిని తొలగించాలని.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు ఒక ప్రయివేటు సైన్యాధిపతిగా మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నవారిని ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారని.. స్టీఫెన్ రవీంద్రపై నేను సూటిగా ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి  అన్నారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్.. బీఆరెస్ కు చందాలు ఇవ్వాలని వ్యాపారస్థులపై ఒత్తిడి తెస్తున్నారని.. రేవంత్ రెడ్డి  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: