వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు ఏపీ సీఎం?

Chakravarthi Kalyan
నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో చెవిలో పువ్వూ, నోట్లో వేలుపెట్టుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు వినూత్నంగా  నిరసన తెలిపారు. వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. చంద్ర బాబు అరెస్టు లో ముఖ్యమంత్రికి సంబంధం లేదంట.. నమ్మాలా అని వేదికపై నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు.  వై.ఎస్. జగన్ కి సొంత పత్రిక, సొంత టి.వి. ఛానల్ లేదంట. నమ్ముదామా  అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.



చంద్ర బాబు వృద్దులకు, వితంతువులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే, కాదు వెయ్యి రూపాయలు అని జగన్ చెబుతున్నారని.. ఇదికూడా నమ్మాలా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు. అందుకే వినేవాడు వెర్రివాడు అయితే, చెప్పేవాడు మన ముఖ్యమంత్రి అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: