ఏపీకి తీవ్ర అన్యాయం.. జగన్ సైలంట్‌?

Chakravarthi Kalyan
కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తున్నా సీఎం జగన్ ఏమీ మాట్లాడటం లేదని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా రెండురాష్ట్రాల మధ్య అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కంటే రాయలసీమ వాసులం ఎక్కువ నష్టపోయామని.. అనేకరకాలుగా ఇబ్బంది పడుతున్నామని.. నీళ్లు లేకుండా ఏ ప్రాంతం అభివృద్ధి జరగదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
తుంగభద్రా పై అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కడతామని కేంద్రం హామీ ఇవ్వడం దారుణమన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి .. దానివల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గుంతకల్ జోన్ లేదు , ఉక్కు పరిశ్రమ లేదు విభజన హామీలు ఎం నెరవేరడం లేదు.. అయినా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదని.. హామీలు నెరవేర్చుకోడానికి ప్రయత్నం చెయ్యడం లేదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: