లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. అరెస్ట్‌ చేస్తామని వార్నింగ్‌?

Chakravarthi Kalyan
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో  Cr.P.C.లోని సెక్షన్ 41Aలోని సబ్-సెక్షన్ (1) కింద నారా లోకేష్ కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐపిసి సెక్షన్ 120(B), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217, అవినీతి నిరోధక చట్టం1988 సెక్షన్ 13(2), 13(1)(c) (d)కింద విచారణ చేపట్టినట్లు సీఐడీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 4 తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని H.బ్లాక్‌, సమృద్ధి నెక్సా అపార్ట్‌మెంట్స్ లో ఉన్న కార్యాలయంలో విచారణకి హాజరుకావాలని సీఐడీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి తమ వద్ద సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని సీఐడీ పోలీసులు నోటీసుల్లో తెలిపారు. కేసు దర్యాప్తుకు సహకరించేలా వాస్తవాలను నిజాయితీగా బహిర్గతం చేయాలని.. నిబంధనలు విధిస్తూ.. సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్  బ్యాంక్ ఖాతా వివరాలను, భూమి లావాదేవీలకు సంబంధించిన బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్‌ను, అందుకు జరిపిన లావాదేవీలకు అవసరమైన చెల్లింపు వివరాలను తమకు దర్యాప్తులో భాగంగా అందించాలని సీఐడీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి నోటీసులో ఉన్న అంశాలు పాటించకపోతే... Cr.P.C సెక్షన్ 41A(3), (4) కింద అరెస్టుకు బాధ్యత వహిస్తారని సీఐడీ పోలీసులు నోటీసుల్లో స్పష్టంగానే వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: