పెళ్లిరోజే జైలుకు చంద్రబాబు.. భువనేశ్వరి కన్నీరు?
చంద్రబాబుకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన సతీమణి భువనేశ్వరి ఎంతో భావోద్వేగం చెందారు. ఏసీబీ కోర్ట్ హాలుకు వెళ్లి చంద్రబాబును భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబును చూసి ఆమె భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకక కన్నీటి పర్యంతమయ్యారు. రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడం కలచివేసింది.