ఆ 4 అక్షరాలు నేర్చుకుంటే ఏభాషైనా ఈజీ అంటున్న కట్టప్ప?

Chakravarthi Kalyan
భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించడమే తనలో ఉన్న సూపర్ పవర్ అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్. కట్టప్పగా తెలుగు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సత్యరాజ్.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా ఆ, ఈ, ఊ, మ అనే పదాలతోనే పెదాలు కదులుతాయని సూత్రీకరించారు. అవి నేర్చుకుంటే ఏ దేశ భాషలోనైనా నటుడిగా రాణించవచ్చని సత్యరాజ్ తెలిపారు.

తన తాజా చిత్రం వెపన్ ప్రచారంలో భాగంగా సత్యరాజ్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు నటీనటులతో ఉన్న అనుబంధాన్ని సత్యరాజ్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది తెలుగు నటులకు తమిళ్ వచ్చని, అందువల్ల సెట్ లో ఎక్కువగా తమిళ్ మాట్లాడుకుంటామని సత్యరాజ్ వివరించారు. తాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఏ భాష పూర్తిగా నేర్చుకోవడం లేదని సత్యరాజ్ అన్నారు. నిరంతరం తెలుగు సినిమాలు చేస్తే తప్పకుండా తెలుగులోనే మాట్లాడుతానని సత్యరాజ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: