కోర్టుకు లోకేశ్.. పాదయాత్రకు విరామం?
ఎటువంటి ఆధారాలు లేకుండా తనకి అవినీతి బురద అంటించాలని చూశారంటూ సింగలూరు శాంతి ప్రసాద్‌పై నారా లోకేష్ కోర్టులో కేసు దాఖలు చేసారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ నారా లోకేష్ హాజరు కానున్నారు. ఓ యూట్యూబ్ చానల్‌కి పోసాని కృష్ణమురళి గతంలో ఇంటర్వ్యూ ఇస్తూ కంతేరులో నారా లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని తన న్యాయవాది ద్వారా నారా లోకేష్ నోటీసులు పంపారు.