
ఏపీ ఎన్నికలు: టైమ్స్ నౌ సర్వే సంచలన ఫలితాలు?
అయితే గతంతో పోలిస్తే.. వైసీపీ ఓట్ల శాతం 51.3 శాతానికి పెరిగినట్టు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. దీంతో ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వే మరోసారి చెబుతోంది. స్పష్టమైంది. ఏపీలో 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి 51.3 శాతం ఓట్లతో ఒకటీ అరా మినహా మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే చెబుతోంది.