బాబు ఆ పని చేసి ఉంటే.. జగన్కు ఛాన్స్ ఉండేదే కాదు?
పేదల సొంతింటి కల నెర వేర్పు కోసం చంద్రబాబు ఏం చేశారన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తనలో నిజాయితీ లేదని అన్నారు. తాము ఇనాం భూముల యజమానులకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తున్నామని.. ఎలిజిబుల్ రైట్స్ ఇస్తున్నామని.. వివాద రహిత భూమి కారణంగా జీడీపీ రెండు శాతం పెరుగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భూ సర్వే 100 ఏళ్ల ముందు బ్రిటిష్ వారు చేశారని... కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నడుస్తున్న ప్రభుత్వం ఆధునిక యంత్ర పరికరాలతో పూర్తి స్థాయిలో నిష్పాక్షిక ధోరణిలో సర్వే చేస్తోందని చెప్పారు.