టీడీపీ దాడిలో చూపుకోల్పోయిన కానిస్టేబుల్.. ఆదుకున్న సీఎం?
చంద్రబాబు నాయుడు పుంగనూరు టూర్ ఘర్షణలకు కేంద్రంగా మారింది. అంగళ్లులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం, వైసిపి వాళ్ళు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తానే స్వయంగా పుంగనూరు కి వస్తానని, ఎవరు ఏం చేస్తారో చూస్తానని అనడం సీన్ మరింత సీరియస్ అయ్యింది. ఇక పుంగనూరు శివార్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు డైరెక్ట్ గా పోలీసుల పైనే దాడులు చేశారు.