పాకిస్తాన్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీలోని 150 ఏళ్ల నాటి హిందూ ఆలయాన్ని ప్రభుత్వం దగ్గరుండి కూల్చేశారు. పురాతనమైనదని కూలిపోయే అవకాశం ఉందనేది సాకు చెప్పి భద్రతను పెంచి మరి దగ్గరుండి కూల్చేశారు. దీని గురించి ఏ ఒక్క అంతర్జాతీయ మీడియా గానీ ఐక్యరాజ్య సమితి గాని మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రజా సంఘాలు వివిధ రాజకీయ మతపరమైన సంఘాలు ఎక్కడ కనీసం చర్చ కూడా జరపడం లేదు. అదే ఇండియాలో బాబ్రీ మసీదు గురించి గతంలో ఎన్నో చర్చలు జరిపారు. అంతర్జాతీయ మీడియా సైతం ఇండియాలో ఏదో జరిగిపోతుందని తెగ ప్రచారం చేస్తుంది.
కానీ భారతదేశంలో దండయాత్రకు వచ్చిన మొగలు బాబర్ అక్బర్ ఔరంగాజేబు లాంటి ఎంతోమంది మహమ్మదీయ రాజులు దేశంలోని ఎన్నో గుళ్లను ధ్వంసం చేశారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఉన్నటువంటి అంశం. ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా పురాతన ఆలయాన్ని కూల్చేయడం దారుణమైన విషయం.