భారీ షాక్‌ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ ?

Chakravarthi Kalyan
జీహెచ్‌ఎంసీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 22 మంది కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బి.గీత రాధిక బదిలీ అయ్యారు. సీడీఎంఏ కార్యాలయంలో జేడీగా టి.కృష్ణమోహన్ రెడ్డి బదిలీ అయ్యారు. బడంగ్ పేట కమిషనర్ గా బి.సుమన్ రావు బదిలీ అయ్యారు.

రామగుండం కమిషనర్ గా సిహెచ్. నాగేశ్వర్, మీర్ పేట కమిషనర్ గా ఏ.వాణి, తుర్కయాంజల్ కమిషనర్ గా సిహెచ్. శ్రీకాంత్ బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీకి కె.నారాయణరావు, పాల్వంచ కమిషనర్ గా ఏ.స్వామి, ఇబ్రహీంపట్నం కమిషనర్ గా పి. రవీంద్ర సాగర్, నాగారం కమిషనర్ గా జి.రాజేంద్ర కుమార్ బదిలీ అయ్యారు.


జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ కమిషనర్ గా ఏ.సురేష్, ఘట్ కేసర్ కమిషనర్ గా ఎండి. సాబెర్ అలీ, మిర్యాలగూడ కమిషనర్ గా ఎం.పూర్ణచందర్, పెద్ద అంబర్ పేట కమిషనర్ గా ఎస్. రవీందర్ రెడ్డి, ఖమ్మం కమిషనర్ గా బి.సత్యనారాయణరెడ్డి బదిలీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: