యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూస్తున్న భారతీయ వార్తా ఛానళ్ల జాబితాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 4వ స్థానంలో నిలిచిందని ఆ ఛానల్ చెప్పుకుంటోంది. యూట్యూబ్ డేటా ప్రకారం.. గతంతో పోల్చితే ఏకంగా 20 స్థానాలు మెరుగుపడి 4వ స్థానానికి ఎగబాకిందని ఆ ఛానల్ ప్రకటించింది. జీ న్యూస్, ఆజ్ తక్, టీవీ9 మరాఠీ తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ చానలే జనం ఎక్కువగా యూట్యూబ్‌లో చూస్తున్నారట. అత్యధికంగా వీక్షించే ఛానళ్ల సరసన నిలిపి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని తెలుగు ప్రజలు ఆదరిస్తున్న తీరుకు ఈ ర్యాంకింగే తిరుగులేని సాక్ష్యం అని ఆంధ్రజ్యోతి చెబుతోంది.
ఏబీఎన్ యూట్యూబ్ వేదికగా దుమ్మురేపుతోందని ఆ ఛానల్ చెబుతోంది. జగన్ సర్కారు కేబుల్ కనెక్షన్లలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ రాకుండా చేస్తోందని ఆరోపిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలతో పాటు ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియకుండా కట్టడి చేయాలని చూస్తున్నా.. జనం యూట్యూబ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ చానల్‌ను వీక్షించి వాస్తవాలు తెలుసుకుంటున్నారని ప్రకటించింది.