ఆ దేశంలో ఉత్సవంగా ఇందిరాగాంధీ హత్య?

Chakravarthi Kalyan
ఇందిరా గాంధీ హత్య 1985లో దేశాన్ని కుదిపేసిన ఘటన. అధికారంలో ఉన్న ప్రధానమంత్రిని ఆమె అంగరక్షకులే కాల్చి చంపిన ఘటన. అయితే.. ఈ ఘటన దేశంలో ప్రత్యేకించి డిల్లీ, పంజాబ్‌లలో అల్లర్లకు కారణమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఈ హత్యను మరో దేశంలో ఉత్సవంగా జరుపుకుంటున్నారు.

ఆ దేశమే కెనడా. కెనడాలో సిక్కులు బలంగా ఉండటంతో.. ఆ ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చింది. అయితే.. ఇందిరాగాంధీ హత్యను ఉత్సవంగా నిర్వహించటానికి అనుమతినివ్వటం ఏమాత్రం సరైన నిర్ణయం కాదని ఇండియా వాదిస్తోంది. ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వార్నింగ్ ఇచ్చారు.  ఈమధ్య భారత్‌, కెనడా మధ్య ఇలాంటి వివాదాలు వస్తూనే ఉన్నాయి. కెనడాలోని సిక్కులు అతివాద సిక్కు ఖలిస్థాన్‌ వాదానికి మద్దతు తెలపడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కెనడా ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: