చంద్రబాబు ఆశలన్నీ ఐ- టీడీపీపైనే?
నాయకులు ప్రత్యక్షంగా తమ తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యకర్తలు చేసే ప్రచారం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కూడా అంతే ముఖ్యం. అంతే కాదు.. పార్టీ విధానాలను, వాణిని బలంగా వినిపించడంలో ఐ-టీడీపీది కీలక పాత్ర కానుంది. వచ్చే ఎన్నికల్లో ఈ విభాగం మరింత కీలకం కానుందని చంద్రబాబు నమ్ముతున్నారు. మరి.. జగన్ సర్కార్ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపడంలో, విమర్శలను తిప్పి కొట్టడంలో ఐ-టీడీపీ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.