లోకేశ్‌ భద్రత: వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదా?

Chakravarthi Kalyan
ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకైన లోకేశ్‌కు ప్రభుత్వం తన పరిధికి మించి పోలీసు భద్రత కల్పిస్తూనే ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. అవసరమనుకుంటే, ఆయన పాదయాత్రలో ఎంతమంది పోలీసులు బందోబస్తు డ్యూటీ చేస్తున్నారనేది ఎవరైనా తెలుసుకోవచ్చని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికీ రానటువంటి కష్టాలు చంద్రబాబు కొడుకు లోకేశ్‌కు వచ్చాయని.. వాళ్ల పార్టీ కార్యకర్తలే సెల్ఫీ దిగలేదని లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

సెల్ఫీ ఫోటో ఇవ్వకపోతే రాళ్లు, కోడిగుడ్లుతో నాయకుల్ని కొట్టే కార్యకర్తలు టీడీపీ పార్టీలో ఉన్నారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మీపార్టీ వాళ్లు మిమ్మల్ని కోడిగుడ్లు విసిరి దాడి చేస్తే.. మేం ప్రభుత్వం తరఫున భద్రత పెంచడమేంటని మాజీ మంత్రి పేర్ని నాని అడిగారు. ముందుగా బాబు టీడీపీ కార్యకర్తలందరికీ క్రమశిక్షణ నేర్పుకోవాలని.. కార్యకర్తలకు క్రమశిక్షణ ఇచ్చుకోలేని దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని అందరూ అనుకోవాలి కదా అని పేర్ని నాని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: