ముసలోడు: బాబుపై వైసీపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు?

Chakravarthi Kalyan
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఒక పండిపోయిన రాజకీయ ముసలోడు చంద్రబాబు పాలనను అందరూ చూశారు కదా అంటూ కామెంట్‌ చేశారు.  కాంట్రాక్ట్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బాబు వాగ్దానం చేశాడు కదా మరి ఆ హామీ ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

మంత్రివర్గ కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేసి, ఐదేళ్లు అధికారం ముగిసినా  ఆ హామీ అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. దీనిపై బాబు సమాధానం చెప్పాలని.. ఆ మంత్రివర్గ కమిటీ ప్రజల చేతుల్లో చచ్చిపోయింది మినహా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క తీర్మాన్నైనా అమలు చేసిందా అని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్‌దే అసలైన ఉద్యోగుల ఫ్రెండ్లీ, ప్రజల ప్రభుత్వమని పేర్ని నాని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: